Email

భక్తి పత్రిక ఆగష్టు 2018

Availability : In Stock

పవిత్ర శ్రావణమాసం ఈ నెల 13వ తేదీన రానుంది. ప్రతి ఇంట్లో ఆడపడుచులు వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలిచేమాసమిది. శ్రావణమాసం పల్లెలు, బస్తీలు అనే విచక్షణ లేకుండా పసుపు కుంకుమలతో పేరంటాలతో కళకళలాడుతుంది. భక్తి ప్రపత్తులు తాండవిస్తాయి. 26వ తేదీన శ్రావణ పూర్ణిమ- రక్షా బంధన్ దినోత్సవం. జాతి మొత్తం జరుపుకొనే జాతీయ పండుగ ఇది. తోబుట్టువులే కాదు, ఇష్టులు, అభిమానులు వాత్సల్య పూర్వకంగా చేతులకు రక్షలు కడతారు. అన్ని వేళలా అండగా ఉంటారనే హార్ధిక ప్రతినే రక్షాబంధనం. శృంగేరి పీఠ ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతి స్వామివారి జన్మదినోత్సవ మంగళవేళ (15న) వారి దివ్యాశీస్సులు అర్ధిద్దాం.

అలాగే గోదాదేవి, స్వామి చిన్మయానంద పుణ్య తిథి 13న వస్తున్నాయి. మహాయోగి, స్వాతంత్ర్య సమర యోధుడు, విశ్వమానవుడు అయిన అరవిందుని జయంతి ఆగస్ట్ 15. సావిత్రి మహాకావ్య నిర్మాత అరవిందుని జయంతి సందర్భంగా వారి దివ్య వచనాలను ఈ సంచిక ద్వారా తెలుసుకొని తరిద్దాం. శ్రావణమాసం వచ్చేసింది. లక్ష్మీపూజ చేసుకొనేందుకు రకరకాల మార్గాలను తలోరకంగా చెబుతున్నారు. ముఖ్యంగా లక్ష్మీపూజ శ్రావణమాసంలోనే కాకుండా ఏడాది పొడవునా చేసుకోవచ్చు. డా. టి.కె.వి. రాఘవన్ రచించిన 'వరాలిచ్చే వరలక్ష్మి' వ్యాసంలోని వివరణ చూద్దాం. లక్ష్మీ స్వరూపాలను వర్ణించి చెబుతుంది శ్రీసూక్తం. సంపదలను ధర్మబద్ధంగా పొందే విధానాలను నిర్దేశించింది. లక్ష్మీ అనుగ్రహం పొందిన వ్యక్తికి సామాజిక బాధ్యతలను వివరించింది. కేవలం లక్ష్మీదేవిని మాత్రమే కాకుండా ఏ అమ్మవారినైనా శ్రీసూక్త విధానంతో పూజించవచ్చు. శ్రీసూక్తాన్ని పారాయణం చేయడం, వినడం వల్ల సకల సంపదలు లభిస్తాయి. డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ రాసిన శ్రీ సూక్త వైభవం వివరణ చూద్దాం.
₨ 51.00 ₨ 51.00
Price / kg:
+
-

- గౌరీదేవి నిత్య సుమంగళి. మంగళ సూత్రానికి అధిష్టాన దేవత. పార్వతీపరమేశ్వరులు ఆది దంపతులు. వారి ఆశీస్సులు అన్యోన్య దాంపత్యానికి అత్యవసరం.

ద్వాపర యుగంలో రుక్మిణీ కల్యాణ ఘట్టంలో కూడా గౌరీపూజ కనిపిస్తుంది. మాంగల్య సౌభాగ్యం కోసం వివాహానికి ముందు వధువు గౌరీపూజ చేయడం

మనదేశంలో అన్ని ప్రాంతాల ఆచారం. అప్పాల శ్యామప్రణీత్ శర్మ రాసిన సౌభాగ్య ప్రదం మంగళ గౌరీవ్రతం వివరణ చూద్దాం.

 

- శారీరక మానసిక శుద్ధి, ఓర్పు, శాంతి, పరోపకార బుద్ధి, దయ ఉబ్బిపోని గుణం కలిగి ఉన్న వారింట శ్రీమహాలక్ష్మి ప్రీతిగా అడుగు పెడుతుంది.

సత్యంలోనూ అప్రమత్తతలోనూ సత్కర్మలోనూ భగవదర్పణ బుద్ధిలోనూ శమదమాదుల్లోనూ తానుంటానని అమ్మవారు

స్వయంగా చెప్పినట్లు మార్కండేయ పురాణం పేర్కొంది. డా. దండెబోయిన పార్వతీదేవి రాసిన సిరులతల్లికి నీరాజనం వివరణ చూద్దాం.

 

- జ్యోతిషశాస్త్రం ప్రకారం లక్ష్మీస్వరూపాలు మొత్తం పదహారు. వాటినే షోడశవర్గులంటారు. వ్యక్తి అదృష్టవంతుడు కావాలంటే జాతకంలో

లక్ష్మీకటాక్షం ఉందో లేదో చూసుకోవాలి. డా. శంకరమంచి రామకృష్ణశాస్త్రి రాసిన అదృష్ట యోగం వివరణ చూద్దాం.

 

- తెలంగాణలో ఆషాఢ బోనాల జాతర మహోత్సవంగా జరుగుతోంది. ఘటం ఊరేగింపులతో, పోతురాజుల డప్పు విన్యాసాలతో, భవిష్యవాణి సందేశాలతో

ఊరూ వాడా పండుగ వాతావరణం నెలకొంది.ఆషాఢమాసం నెల్లాళ్లూ ఏదో ఒక దేవాలయంలో ఆదివారాల్లో బోనాలు జరుగుతుంటాయి.

ఆగస్ట్ 5వ తేదీ బోనాల ముగింపు సందర్భంగా సింహవాహినికి బోనాలు వివరణ చూద్దాం.

 

- అకిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని సన్నిధి మహాసంప్రోక్షణకు సిద్ధమైంది. ఇది పుష్కరానికోసారి జరిగే మహిమాన్విత క్రియ.

ఈ సందర్భంగా తిరుమల ఆలయంలో ఈనెల 9వ తేదీ సాయంత్రం 6గంటల నుంచి 17వ తేదీ ఉదయం 6గంటల వరకు

వెంకన్న దర్శన వేళలను పరిమితం చేస్తారు. కె.సంస్కృతి రాసిన తిరుమలలో మహాసంప్రోక్షణ వివరణ చూద్దాం.

 

- ఇంకా సునీత శేఖర్ రాసిన సమత్వం- స్థిరత్వం వివరణ, శృతి దామోదర్ రాసిన యతికుల తిలకుడు వివరణ, కోగంటి వేంకట శ్రీరంగనాయకి రాసిన గోదాయై మంగళం వివరణ,

శ్రీరమణ రాసిన స్వర్గారోహణం వివరణాత్మక వ్యాసాలు, డా. కడిమిళ్ల వరప్రసాద్ రాసిన ఆరుసంపదలు వివరణ వంటివి ఎన్నో ఈ పత్రికలో చూడవచ్చు.

 

- అలాగే.. ఓగేటి ఇదిరాదేవి రాసిన నమశ్సివాభ్యామ్ అనే వ్యాసం, మాసఫలం వంటివి చూడవచ్చు.

ఈ సంచికతో పాటు శ్రీవరలక్ష్మీ వ్రతకల్పం అనే ప్రత్యేక సంచికను కూడా పొందవచ్చు.

Reviews

Tuesday, 07 August 2018 Rating: 5/5
I paid 51 INR for this magazine. I thought it is for a hard copy. But came to know it is to read online only. ok fine. but I am not even able to read online also. it is asking to pay again..What is this?
REVATHI M